మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి శంకుస్థాపన
మహిళా సంఘాల బలోపేతానికి ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి కృషి....
శివంపేట్ నవంబర్ 18 (విజయక్రాంతి ): శివంపేట్ మండలం చెన్నాపూర్ గ్రామంలో మహిళా సమాఖ్య భవన(Women's Federation Building) నిర్మాణానికి నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేశారు. మహిళా సంఘాలకు సొంత భవనం ఏర్పాటు కావడం ద్వారా మహిళా సమాఖ్య కార్యకలాపాలకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని, మహిళలు సంఘటితంగా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు దోహదపడుతుందని నాయకులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రమణ గౌడ్ మాట్లాడుతూ మహిళల సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మహిళా సంఘాల అభివృద్ధికి ఈ భవనం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.
ఈ కార్యక్రమం లో మెదక్ జిల్లా కో ఆప్షన్ మెంబర్ మన్సూర్, చెన్నాపూర్ ఆకుల కొమురయ్య,యాదగౌడ్, రాజశేఖర్ గౌడ్, రాజేందర్ నాయక్,గ్రామపంచాయతీ పాలక వర్గం, మండల బిఆర్ఎస్ నాయకులు, సర్పంచ్ కార్యకర్తలు తదితరులు పాలొగొన్నారు.