ఏసీబీ వలలో సర్పంచ్

18-11-2026 | 08:23pm

మహబూబాబాద్, నవంబర్ 18 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా, సీరోలు మండలం, మోదుగడ్డ తండా సర్పంచ్ ధరావత్ వీరు బుధవారం వరంగల్ ఏసీబీ బృందానికి(Warangal ACB Team) పట్టుబడ్డారు. ఖమ్మంలోని ఫిర్యాదుదారు కార్యాలయంలో డిమాండ్ చేసిన లంచం రూ. 13,00,000లో మొదటి విడతగా రూ. 2,00,000 తీసుకుంటుండగా ఆయనను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

మొదట రూ. 30,00,000 డిమాండ్ చేసిన నిందితుడు, తర్వాత దానిని రూ. 13,00,000కు తగ్గించాడు. గ్రానైట్స్ క్వారీల కార్యకలాపాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడటానికి, ఆ గ్రానైట్ వ్యాపారం సజావుగా సాగేందుకు సహకరించడానికి ఈ లంచం అడిగాడు. ట్రాప్ సమయంలో రూ. 2,00,000 లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.నిందితుడిని అరెస్టు చేసి, జ్యుడీషియల్ రిమాండ్ కోసం వరంగల్‌లోని ఎస్‌పీఈ, ఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టులో హాజరు పరచనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు