ప్రతి పేద కుటుంబానికి రూ.5లక్షల బీమా
డీసీసీ ప్రెసిండెంట్ మహ్మద్ ఆయూబ్
వరంగల్, నవంబర్ 18 (విజయక్రాంతి):రాష్ర్టంలోని ప్రతి పేద కుటుంబానికి ఆర్థిక భద్రత సామాజిక రక్షణ(Social Protection) కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పతకాన్ని(Indiramma Family Life Insurance Scheme) ప్రవేశపెట్టిదిందని వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహ్మద్ ఆయూబ్ అన్నారు. ఈ పథకాన్ని గురువారం ప్రారంభించనున్నట్లుగా తెలిపారు.
ఈ పథకం కింద కుటుంబంలో సంపాదించే వ్యక్తి 18 నుంచి 59 ఏళ్లు ఉంటే బీమా పొందేందుకు అర్హులన్నారు. వయస్సు నిర్ధారణకు పుట్టిన తేదిని ప్రామాణికంగా తీసుకుంటారని వివరించారు. బీమా పొందిన సభ్యుడు మరణిస్తే వారి కుటుంబానికి ప్రభుత్వం ద్వారా రూ.5లక్షల బీమా మొత్తం చెల్లించనున్నట్లుగా ఆయన పేర్కొన్నారు.