అదృశ్యమైన మహిళ

18-11-2026 | 08:42pm

ఘట్ కేసర్, నవంబర్ 18 (విజయక్రాంతి) : ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్(Ghatkesar Police Station) పరిధిలోని మాధారం గ్రామానికి చెందిన కుతాడి మౌనిక (31) తన ఇద్దరు కుమారులు చరణ్ (8), నైనేశ్వర్ (4)లతో కలిసి ఈనెల 17న అదృశ్యమైనట్లు ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయబడింది.

ఈఘటనపై ఘట్‌కేసర్ పోలీసులు తక్షణమే స్పందించి, గాలింపు చర్యలు చేపట్టి, అన్ని కోణాల్లో విచారణ కొనసాగించారు. పోలీసుల దర్యాప్తు, కృషి ఫలితంగా అదృశ్యమైన మహిళ మౌనిక ఆచూకీని గుర్తించి వెతికి బుధవారం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.  ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యం అని సీఐ కిరణ్ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు