బెజ్జూర్ ఎస్సైని సన్మానించిన కాంగ్రెస్ నాయకులు
బెజ్జూర్ అక్టోబర్ 7 (విజయ క్రాంతి): బెజ్జూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో నూతనంగా ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన కె. రమేష్‌ను జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రేణుకుమార్ పెంటన్న(District General Secretary Renukumar Pentanna), బ్లాక్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి రాచకొండ శ్రీవర్ధన్ పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు(Congress party leaders) మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్సై రమేష్‌ను నాయకులు శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం బెజ్జూర్ మండలంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలని కోరుతూ పలు అంశాలపై చర్చించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని నాయకులు ఎస్సైను కోరారు.
మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆదర్శ్, యూత్ అధ్యక్షుడు శ్రీకాంత్,నాయిని నారాయణ బిజ్జెర భూమన్న, రత్నం శంకర్, ఇరుగురాళ్ల భాస్కర్, బండ వెంకన్న, డోకే మల్లేష్, గొబ్బిరే అంకులు, తుంగడే సాంబయ్య, గురుండ్ల పోషన్న తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.