ఆసుపత్రిలో స్వచ్ఛతా ప్రత్యేక కార్యక్రమం

07-10-2026 | 03:28pm

ఇల్లెందు , (విజయక్రాంతి): సింగరేణి ఇల్లందు ఏరియా ఆసుపత్రిలో స్వచ్ఛతా ప్రత్యేక కార్యక్రమం–6(Swachhata Program) ను బుధవారం నిర్వహించారు. ఎస్‌ఓ టు జీఎం జాకీర్‌ హుస్సేన్, డీజీఎం (పర్సనల్) అజ్మీర తుకారాం ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, మందుల ఖాళీ కవర్లు, సీసాలు తదితర వ్యర్థాలను ప్రత్యేక చెత్తబుట్టల్లోనే వేయాలని వారు సూచించారు. పరిశుభ్రమైన వాతావరణం ఆరోగ్యకరమైన జీవనానికి అవసరమని, స్వచ్ఛతను ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు.

పర్యావరణ అధికారి నరసింహారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డీవైఎంవో డాక్టర్‌ శారదాదేవి, డాక్టర్‌ మురళీమోహన్, ఆసుపత్రి సిబ్బంది, క్లర్కులు, ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది పాల్గొని పరిసరాలను శుభ్రం చేశారు.

మరిన్ని వార్తలు