అంబేద్కర్ స్వర్ణోత్సవ వేడుకలను విజయవంతం చేయాలి..
10-11-2026 | 05:05pm
తాడ్వాయి, నవంబర్ 10 (విజయక్రాంతి): ఈనెల 14న హైదరాబాదులో నిర్వహించే అంబేద్కర్ 50వ సర్నోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని తాడ్వాయి మండల అంబేద్కర్ యువజన సంఘం(Ambedkar Youth Association) ప్రధాన కార్యదర్శి గైని రాజలింగం పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో మంగళవారం అంబేద్కర్ 50వ స్వర్నోత్సవ వేడుకల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఈ స్వర్ణోత్సవ వేడుకలకు తరలి వెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ఇన్చార్జి గైని సంజీవ్,గడ్డం రవీందర్, రాజు, ప్రభాకర్, సాయిలు, గంగారాం, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.