నూతన సబ్‌రిజిస్ట్రార్ ఓంప్రకాష్‌కు ఘన సన్మానం

10-11-2026 | 05:11pm

పెద్దపల్లి, నవంబర్ 10 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా(Peddapalli District) కేంద్రంలో నూతనంగా సబ్‌రిజిస్ట్రార్‌గా(Sub-Registrar) బాధ్యతలు చేపట్టిన బాకం ఓంప్రకాష్‌ను తెలంగాణ రాజ్యాధికార పార్టీ(Telangana Rajyadhikara Party) పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు మెరుగు చందర్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శాలువా కప్పి, పూలబొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మెరుగు చందర్ యాదవ్ మాట్లాడుతూ అనుభవజ్ఞుడైన ఓంప్రకాష్ సబ్‌రిజిస్ట్రార్‌గా బాధ్యతలు చేపట్టడం పెద్దపల్లి ప్రజలకు శుభపరిణామమన్నారు. ఆయన హయాంలో రిజిస్ట్రేషన్ శాఖలో(Registration Department) పారదర్శక పాలన అందిస్తూ, అవినీతికి తావులేకుండా ప్రజలకు వేగవంతమైన సేవలు అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ తరఫున పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మెరుగు సతీష్ గౌడ్, జిల్లా సంయుక్త కార్యదర్శి కాంపెల్లి స్వామి, పెద్దపల్లి మున్సిపల్ అధ్యక్షుడు వెంగల కృష్ణ, పెద్దపల్లి మండల అధ్యక్షుడు కళాబోయిన సంపత్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు