రీ-సర్వేకు రైతులు సహకరించాలి

10-11-2026 | 05:29pm

సర్వే పనులు పరిశీలించిన అదనపు కలెక్టర్ నాగేష్ 

ముస్తాబాద్, నవంబర్ 10 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని మొర్రాపూర్ గ్రామంలో కొనసాగుతున్న భూముల రీ-సర్వే కార్యక్రమంలో భాగంగా మంగళవారం అదనపు కలెక్టర్ నాగేశ్(Additional Collector Nagesh), జిల్లా సర్వే అధికారి శ్రీనివాస్ క్షేత్రస్థాయిలో రీ-సర్వే పనులను పరిశీలించారు.

సర్వే పనుల పురోగతి, రీ-సర్వే ప్రక్రియకు రైతులంతా అందుబాటులో ఉండి,సర్వే సిబ్బందికి అవసరమైన భూ వివరాలను అందిస్తూ పూర్తిస్థాయిలో సహకరించాలని అదనపు కలెక్టర్ సూచించారు. రీ-సర్వే ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు రైతుల భాగస్వామ్యం ఎంతో అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజు నాయక్,తహసీల్దార్ ఫారూక్, గిర్దావర్, సర్వే సిబ్బంది రైతులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు