పిల్లల ఆరోగ్యాన్ని కాపాడాలి
నిర్మల్ నవంబర్ 10 ( విజయక్రాంతి): బాసర ట్రిపుల్ ఐటీలో(Basara IIIT) విద్యార్థులు(Students) అనారోగ్య సమస్యలతో(Health problems) ఇబ్బందులు పడుతున్నారని విద్యార్థుల(Students) తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను పరిష్కరించి తమ పిల్లల ఆరోగ్యాన్ని కాపాడాలని కోరుతూ మంగళవారం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. విశ్వవిద్యాలయంలో(University) చదువుకుంటున్న తమ పిల్లలకు కలుషిత నీరు తాగడం వల్ల శరీరంపై దద్దుర్లు, మచ్చలు ఏర్పడి తీవ్ర దురదతో చర్మవ్యాధుల బారిన పడుతున్నారని తల్లిదండ్రులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సమస్యల కారణంగా విద్యార్థులు చదువుపై దృష్టి సారించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విశ్వవిద్యాలయ అధికారులు తాగునీటి సరఫరాపై నిర్లక్ష్యం వీడి, శుద్ధి చేసిన సురక్షిత మంచినీటిని అందించాలని కోరారు. చర్మవ్యాధులతో బాధపడుతున్న విద్యార్థులకు వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు.