కరువును జాతీయ విపత్తుగా ప్రకటించాలి

10-11-2026 | 05:18pm

ఆసిఫాబాద్, నవంబర్ 10 (విజయక్రాంతి): ఎల్‌నినో(ElNino) ప్రభావంతో తీవ్ర కరువును ఎదుర్కొంటున్న జిల్లాలోని అన్ని మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఆత్మకూరి చిరంజీవి డిమాండ్ చేశారు. కరువును జాతీయ విపత్తుగా ప్రకటించి రైతులు, వ్యవసాయ కూలీలను తక్షణమే ఆదుకోవాలని కోరారు. సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్‌ హరిత కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు తాళ్లపెళ్లి దివాకర్ గౌడ్, భోగే ఉపేందర్, రఘు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు