బాలాల దినోత్సవ సందర్భంగా విద్యార్థులకు అన్నదానం
రాజాపూర్ నవంబర్ 13 : మహబూబ్ నగర్ జిల్లా(Mahabubnagar District) జిల్లా కేంద్రంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా(Collector Khushboo Gupta) ఆధ్వర్యంలో నిర్వహించిన బాలల దినోత్సవం(Childrens Day) వేడుకలలో తిరుమలాపూర్ గ్రామ నివాసి కట్ట సంతోష్ కుమార్ గ్రామ సర్పంచ్ సంతోష వెంకటేష్ వేడుకలలో పాల్గొన్న 400 మంది విద్యార్థులకు అందరికీ భోజనం సౌకర్యం కల్పించారు. బాలల దినోత్సవ వేడుకలలో పాల్గొన్న విద్యార్థులకు అందరికీ భోజనం సౌకర్యం కల్పించినందుకు గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలను ప్రత్యేకంగా అభినందించి సన్మానించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బంగారి సంతోష వెంకటేష్, ఉప సర్పంచ్ మంత్రి రామచందర్, పుల్లారెడ్డి, మల్లయ్య,యాదగిరి,శ్రీశైలం,నందకుమార్, కలెక్టర్ ఆఫీస్ అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.