ఘనంగా పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్టాపనోత్సవం

13-11-2026 | 07:41pm

హాజరైన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ

మానకొండూరు, నవంబర్ 13 (విజయక్రాంతి): మానకొండూర్ మండలం శ్రీనివాస్ నగర్ గ్రామంలో శుక్రవారం నిర్వహించిన పెద్దమ్మతల్లి స్థిర యంత్ర విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవ కార్యక్రమానికి(Peddamma Thalli Event) మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ (MLA Kavvampally Satyannarayan) ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పెద్దమ్మతల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెద్దమ్మతల్లి ఆశీస్సులు మానకొండూర్ నియోజకవర్గ ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో జీవించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మానకొండూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ద్యావ శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేవెల్లి రాజలింగం, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు పురం శంకర్ , ఉపాధ్యక్షులు కూన చంద్రయ్య   అధ్యక్షులు కూన శంకర్ , కూన రమేష్, అనవేని కుమార్, అనవేని రాజు , మానకొండూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎరవేణి రామాంజనేయ , తదితరులు హాజరయ్యారు.

మరిన్ని వార్తలు