చేయూత పెన్షన్ పత్రాల పంపిణీ
13-11-2026 | 07:44pm
ఆసిఫాబాద్, నవంబర్ 13(విజయ క్రాంతి): ఆసిఫాబాద్ మున్సిపాలిటీ(Asifabad Municipality) పరిధిలోని 15వ వార్డులో నూతనంగా మంజూరైన చేయూత పెన్షన్ల పత్రాలను(Cheyuta pension documents) అర్హులైన లబ్ధిదారులకు ప్రజాప్రతినిధులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అబ్దుల్లా భాయ్, డీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఉబైద్ బిన్ యాహియా (తారీక్), మొహమ్మద్ షఫీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడమే చేయూత పింఛన్ల లక్ష్యమని తెలిపారు.