కామారెడ్డిలో డిజిపి కి స్వాగతం పలికిన కలెక్టర్, ఎస్పీ
కామారెడ్డి, నవంబర్ 27 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాకు వచ్చిన డిజిపి ఇవి ఆనంద్(DGP EV Anand) కు కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగు వాన్ (Collector Ashish Sangwan), ఎస్పీ రాజేష్ చంద్ర స్వాగతం పలికారు. శుక్రవారం కామారెడ్డికి వచ్చిన డిజిపి సివి ఆనంద్ కు కలెక్టర్ పూల మొక్కను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం డిజిపి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.
పోలీసులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో జరిగిన నేరాలు, ఘోరాలు, జిల్లాలో ప్రవేశపెట్టిన కార్యక్రమాలను డిజిపి సివి ఆనంద్ అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో వినూత్నంగా ఆపరేషన్ కవాచ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్పి రాజేష్ చంద్ర తెలిపారు. నిజాంబాద్ జిల్లా కేంద్రంతో పాటు ప్రధాన పట్టణ కేంద్రాల్లో అర్ధరాత్రి సైతం అర్ధరాత్రి పట్టణ సరిహద్దుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఇతర రాష్ట్రాలకు చెందిన దొంగలు రాకుండా ఆపరేషన్ కవచ్ కార్యక్రమంలో అరికట్టడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో ఆత్మహత్యలకు పాల్పడే వారి విషయాలను పోలీసులకు సమాచారం అందిస్తే వెంటనే స్పందించి ఆత్మహత్యల నిరోధానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. కుటుంబ కలహాల పై పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహిస్తూ భార్యాభర్తలు కలిసి ఉండే విధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు.
అంతర్ రాష్ట్ర దొంగల ముఠా లు జిల్లాకు వచ్చి చోరీలు చేసేవారని ప్రస్తుతం నియంత్రించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి, జిల్లా పోలీస్ అధికారులు పాల్గొన్నారు.