ఏరీస్ ఆగ్రో సేవా కార్యక్రమాలు అభినందనీయం

27-11-2026 | 10:44pm

57వ ఫౌండేషన్ డే సందర్భంగా వృద్ధాశ్రమంలో అన్నదానం

వృద్ధులకు అన్నదానం చేయడం సంతృప్తినిస్తోంది

బండ్లమూడి నాగేశ్వరరావు

చివ్వెంల, నవంబర్ 27 (విజయక్రాంతి): సమాజ సేవలో భాగంగా వృద్ధులకు అన్నదానం చేయడం ఎంతో సంతృప్తినిస్తుందని ఏరీస్ ఆగ్రో లిమిటెడ్(Aries Agro Limited) ఉమ్మడి నల్లగొండ జిల్లా కంపెనీ ప్రతినిధి బండ్లమూడి నాగేశ్వరరావు(Bandlamudi Nageswara Rao) అన్నారు. కంపెనీ 57వ ఫౌండేషన్ డే సందర్భంగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు(Service Activities) నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా శుక్రవారం చివ్వెంల మండలం దురాజ్‌పల్లిలోని వివేకానంద వృద్ధాశ్రమంలో(Vivekananda Old Age Home) కంపెనీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధులకు భోజనం వడ్డించి వారి ఆశీస్సులు పొందారు.

నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఫౌండేషన్ డే వేడుకలను కేవలం ఉత్సవాలకే పరిమితం చేయకుండా, సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలు చేపట్టడం ఆనందంగా ఉందన్నారు. వృద్ధుల పట్ల ప్రేమ, ఆప్యాయత చూపడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు మోదిని నాగేశ్వరరావు, ఒంటికొమ్ము నవీన్, మహేష్, శ్రీకాంత్, చౌడయ్య, లింగయ్య, డీలర్లు బద్దం వెంకారెడ్డి, శ్రీరంగం కృష్ణమూర్తి, సామ సుధాకర్ రెడ్డి, వివేకానంద వృద్ధాశ్రమం కమిటీ సభ్యులు సవురాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు