దోమల నివారణకు ఫాగింగ్
27-11-2026 | 10:46pm
కేసముద్రం: కేసముద్రం పట్టణం(Kesamudram town) అమీనాపురం 5వ, 6వ వార్డుల్లో దోమల నివారణకు(Mosquito Control) కౌన్సిలర్లు పురం రాజమణి రమేష్, పాయిరాల శరత్ యాదవ్, మున్సిపల్ సిబ్బంది సహకారంతో దోమల నివారణ కోసం ఫాగింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు పురం రాజమణి రమేష్, వాయిరాల శరత్ యాదవ్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రతే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో రావుల వెంకన్న, సామ సుధాకర్ రెడ్డి, ఎర్రంశెట్టి అశోక్, గడిపల్లి రవి, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.