వార్డు సభ్యురాలి కుటుంబానికి ఫోరం ఆర్థిక సాయం!
శివంపేట్ నవంబర్ 27(విజయక్రాంతి ): మెదక్ జిల్లా(Medak District) శివంపేట మండలం(Shivampet Mandal) తిమ్మాపూర్ గ్రామానికి చెందిన మూడో వార్డు సభ్యురాలు ఒగ్గు మైసమ్మ(Oggu Maisamma) అకాల మరణం చెందడంతో ఆమె కుటుంబాన్ని శివంపేట మండల వార్డు మెంబర్స్ ఫోరం కమిటీ సభ్యులు పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి, రూ.6 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గంతి అశోక్ యాదవ్, మండల ఇన్చార్జి కొడకంచి స్వాతి గణేష్ గౌడ్, మండల అధ్యక్షుడు యాదగిరి యాదవ్ బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు. వార్డు సభ్యుల కుటుంబాలకు ఫోరం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
అనంతరం కొడకంచి స్వాతి గణేష్ గౌడ్ మాట్లాడుతూ విధుల్లో కొనసాగుతూ అకాల మరణం చెందిన వార్డు సభ్యురాలు మైసమ్మ కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆర్థిక భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. వార్డు సభ్యుల సేవలను ప్రభుత్వం గుర్తించి వారి కుటుంబాలకు భద్రత కల్పించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి సత్తారం ప్రవీణ్, మండల గౌరవ అధ్యక్షుడు కల్లూరి సహాదేవ్, బల్కంపేట కుమార్, అశోక్ గౌడ్, ప్రవీణ్ గౌడ్, సంజీవ్ తదితర వార్డు సభ్యులు పాల్గొన్నారు.