రోడ్డు భద్రతపై అవగాహన

27-11-2026 | 11:00pm

ఘట్ కేసర్, నవంబర్ 27 (విజయక్రాంతి) : మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి(Malkajgiri Police Commissioner Sumathi) ఆదేశాల మేరకు, ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్(Ghatkesar Police) పరిధిలోని అవుషాపూర్ అండర్ పాస్ వద్ద ఘట్‌కేసర్ ఇన్ స్పెక్టర్ కిరణ్(Ghatkesar Inspector Kiran) ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం ఎస్‌ఐ,  ఏఎస్‌ఐ, పోలీస్ సిబ్బందితో కలిసి అర్రైవ్ అలైవ్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈకార్యక్రమంలో సీఐ కిరణ్ మాట్లాడుతూ వాహనదారులు, ద్విచక్ర వాహనదారులు, ప్రయాణికులు, ప్రజలతో పాటు ముఖ్యంగా విద్యార్థులు, యువతకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.

అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం, డ్రైవింగ్ సమయంలో సెల్‌ఫోన్ వినియోగం, హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించకుండా ప్రయాణించడం వల్ల జరిగే ప్రమాదాల గురించి వివరించారు. ఈసందర్భంగా వాస్తవంగా జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలను ఉదహరిస్తూ, ప్రమాదాల వల్ల ప్రాణనష్టం సంభవించడమే కాకుండా బాధిత కుటుంబాలు ఎదుర్కొనే తీవ్ర పరిణామాలు, మానసిక వేదన, కుటుంబాలపై పడే ప్రభావాన్ని వివరించి అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, బాధ్యతాయుతంగా వాహనాలు నడిపి తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడుకోవాలని సీఐ కిరణ్ సూచించారు.

మరిన్ని వార్తలు