డీజీపీ సీవీ ఆనంద్‌కు ఘన స్వాగతం

27-11-2026 | 10:50pm

బోధన్, నవంబర్ 27 (విజయక్రాంతి): రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) సీవీ ఆనంద్(CV Anand) శుక్రవారం సాయంత్రం నిజామాబాద్ జిల్లా(Nizamabad District) పర్యటనకు విచ్చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఉన్నతాధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. జిల్లా కేంద్రానికి చేరుకున్న డీజీపీకి కలెక్టర్ ఇలా త్రిపాఠి(Collector Ila Tripathi), పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్యతో పాటు ఇతర అధికారులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికి పూల మొక్కలను అందజేశారు. అనంతరం డీజీపీతో అధికారులు కొద్దిసేపు భేటీ అయ్యారు. అంతకుముందు పోలీసుల నుంచి డీజీపీ గౌరవ వందనం స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఐజీపీ (స్పోర్ట్స్ అండ్ వెల్ఫేర్, పి&ఎల్) డాక్టర్ గజరావు భూపాల్, మల్టీ జోన్ ఐజీపీ కార్తికేయ, అదనపు డీసీపీ శుభం నగ్రాలే తదితర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు