అక్రమ ఇసుక రవాణా చేస్తున్న రెండు ట్రాక్టర్లు పట్టివేత
27-11-2026 | 10:48pm
మల్లాపూర్, నవంబర్ 27(విజయక్రాంతి ): మల్లాపూర్ మండలంలో(Mallapur Mandal) అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. పాతధామరాజుపల్లి గ్రామ శివారులోని గోదావరి నది నుంచి అక్రమంగా ఇసుకను తవ్వి, మండలంలోని వివిధ గ్రామాలకు తరలిస్తున్నట్లు గుర్తించారు.ఈ మేరకు TS16 FD 6982, TS19 C 8144 నంబర్లు గల రెండు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. రత్నపూర్ గ్రామ వీఆర్ఏ బక్కూరి విజయ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెండు ట్రాక్టర్లను సీజ్ చేసి, వాటి యజమానులపై కేసులు నమోదు చేసినట్లు మల్లాపూర్ ఎస్సై అనిల్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పేర్కొన్నారు.