బహిరంగంగా మద్యం సేవించిన ఐదుగురికి శిక్ష!

27-11-2026 | 10:53pm

స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించాలని న్యాయస్థానం ఆదేశం

మేడిపల్లి, నవంబర్ 27 (విజయక్రాంతి): బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ(While consuming alcohol) పట్టుబడిన ఐదుగురికి న్యాయస్థానం(Court of Law) స్వచ్ఛభారత్ పనిష్మెంట్(Swachh Bharat Punishment) విధించింది. మేడిపల్లి పోలీస్ స్టేషన్(Medipally Police Station) పరిధిలోని చెంగిచెర్ల బస్ డిపో సమీపంలో నవంబర్ 25న బహిరంగంగా మద్యం సేవిస్తున్న ధారావత్ చందూలాల్(33), బానోత్ చందు(24), బోడ గోపాల్(24), ధారావత్ సుధాకర్(25), గుడిమే సోను(30)ఈ ఐదుగురిని పోలీసులు గుర్తించి పెట్టీ కేసులు నమోదు చేశారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపర్చగా, న్యాయమూర్తి స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు. బహిరంగ ప్రదేశాల్లో పద్యం సేవిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని, పునరావృతమైతే కఠినంగా వ్యవహరిస్తామని సిఐ డి.జలంధర్ రెడ్డి హెచ్చరించారు.

మరిన్ని వార్తలు