పోక్సో కేసులో రెండేళ్ల జైలుశిక్ష

27-11-2026 | 11:08pm

ఎల్బీనగర్, నవంబర్ 27 : చైతన్యపురి పోలీస్ స్టేషన్‌లో(Chaitanyapuri Police Station) నమోదైన పోక్సో కేసులో(POCSO case) నిందితుడికి జిల్లా కోర్టు(District Court) రెండేండ్ల జైలుశిక్ష విధించింది. హయత్ నగర్ మండలం తట్టి అన్నారం పరిధిలోని ఆర్కేనగర్ కు చెందిన షేక్ యూనస్(28) కేసులో దోషిగా నిర్ధారణ కావడంతో  న్యాయస్థానం రెండేండ్ల జైలుశిక్ష, రూ. 2వేల జరిమానా విధించింది. బాధితురాలికి రూ. 50వేల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే...  ఇంటర్ చదువుతున్న విద్యార్థిని శివానీ కళాశాల నుంచి ఓమ్ని ఆసుపత్రి బస్‌స్టాప్ వైపు నడుచుకుంటూ కొత్తపేటలోని రైతు బజార్ వద్దకు చేరుకుంది. ఆమె ఇంటి సమీపంలో నివసిస్తున్న షేక్ యూనస్ విద్యార్థినిని అనుసరిస్తూ వేధించాడు. గతంలో కూడా యూనస్ మద్యం మత్తులో ఆమె ఇంటికి రాగా, ఆమె తల్లి మందలించింది.

అప్పటి నుంచి విద్యార్థిని అనుసరిస్తూ వేధిస్తున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు 2023 డిసెంబర్ 14న‌ చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  నిందితుడిని 15-12-2023న అరెస్టు చేశారు. ఎల్బీనగర్ లోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు న్యాయమూర్తి పద్మావతి కేసు విచారించి, యూనస్ ని నిందితుడిని దోషిగా రెండేండ్ల జైలుశిక్ష, బాధితురాలికి పరిహారం చెల్లించాలని శుక్రవారం తీర్పు వెలువరించారు. ఈ కేసులో దర్యాప్తు అధికారిగా ఎం.ఆర్‌.ఎస్‌.వి. ప్రసాద్, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు పి. సత్యనారాయణ, కృష్ణ ప్రసన్న కోర్టులో వాదనలు వినిపించారు.

మరిన్ని వార్తలు