రేపు అంగవైకల్యంతో బాధపడుతున్న వారికి సహాయక పరికరాల అందజేత..

29-09-2026 | 10:27pm

మాజీ డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి..

బాన్సువాడ, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) బాన్సువాడ పట్టణానికి చెందిన అంగవైకల్యంతో బాధపడుతున్న యాదగిరి, కరణ్, మహమ్మద్ కుటుంబాలకు అండగా నిలిచి, వారి జీవితాల్లో తిరిగి ఆశాకిరణాలు నింపేందుకు కృత్రిమ చేయి, కాలు వంటి సహాయక పరికరాలను బుధవారం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో సాయంత్రం నాలుగు గంటలకు మాజీ డీసీసీబీ ఛైర్మన్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పోచారం భాస్కర్ రెడ్డి చేతిలో మీదుగా అందజేయనున్నారు. ఈ కార్యక్రమానికి బాన్సువాడ నియోజకవర్గ నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ ఆయన కోరారు.

మరిన్ని వార్తలు