బిక్కనూర్‌ పీహెచ్‌సీలో ఎల్‌సీడీసీ సర్వే తనిఖీ

28-10-2026 | 03:48pm

బిక్కనూర్, అక్టోబర్‌ 28 (విజయక్రాంతి): కుష్ఠు వ్యాధి కేసుల గుర్తింపు(Identification of leprosy cases) కోసం నిర్వహిస్తున్న ఎల్‌సీడీసీ కార్యక్రమాన్ని(LCDC program) హైదరాబాద్‌ రాష్ట్ర పర్యవేక్షణాధికారిణి డాక్టర్‌ సుష్మా(Dr. Sushma) బిక్కనూర్‌ పీహెచ్‌సీలో(Bikkanur PHC) తనిఖీ చేశారు. ఆమెతో పాటు డీపీఎంవో శ్రీనివాసరెడ్డి, జిల్లా డీపీఎంవో జీవన్‌ పాల్గొన్నారు.ఈ నెల 22 నుంచి ఆరు రోజుల్లో 3,727 ఇళ్లను సందర్శించి, 14,019 మందిని పరీక్షించగా 40 అనుమానిత కేసులను గుర్తించి పీహెచ్‌సీకి పంపించినట్లు సిబ్బంది తెలిపారు.

అనంతరం ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బందితో సమావేశమైన డాక్టర్‌ సుష్మా సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని, లోపాలను సరిదిద్దుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో కొన్ని ఇళ్లను సందర్శించి సర్వే వివరాలు, మార్కింగ్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి వెంకటరమణ, పబ్లిక్‌ హెల్త్‌ నర్స్‌ జానకి, సూపర్‌వైజర్లు రాజమణి, సువర్ణ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు