రాష్ట్రస్థాయి క్రీడలకు ఎంపికైన కేజీబీవీ విద్యార్థిని
29-09-2026 | 08:25pm
నాగిరెడ్డిపేట, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల(Kasturba Gandhi Girls School)కు చెందిన 9వ తరగతి విద్యార్థిని కే.రవళి రాష్ట్రస్థాయి రగ్బీ బాల్ అటకు ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపల్ గీత, వ్యాయామ ఉపాధ్యాయురాలు శోభ తెలిపారు.ఎస్.జి.ఎఫ్ ఆధ్వర్యంలో ఈనెల 28న కామరెడ్డి,నిజామాబాద్ జిల్లా అండర్ 14 బాయ్స్ అండ్ గర్ల్స్ ఎంపిక మాచారెడ్డి మండల కేంద్రంలో నిర్వహించగా అందులో అండర్ 14 ఇయర్స్ బాలికల విభాగంలో రగ్బీ బాల్ ఆట ఆడేందుకు రాష్ట్రస్థాయి క్రీడలకు ఎంపిక కావడంపై తోటి విద్యార్థులు మండలవాసులు విద్యార్థి రవళిని అభినందిస్తున్నారు.