రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసిన భాజపా నాయకులు..
బాన్సువాడ, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ బీజేపీ బాన్సువాడ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం అంబేద్కర్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షులు నీలం చిర రాజులు మాట్లాడుతూ రాముడు సంపన్నుల దేవుడు, శివుడు పేదల దేవుడు అంటూ సీఎం చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని అన్నారు. మతం, దేవుళ్ల పేరుతో ప్రజల మధ్య విభేదాలు సృష్టించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. హిందువుల మనోభావాలను గౌరవిస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని బహిరంగ హిందూ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
హిందువుల మనోభావాలతో చెలగాటమాడే ఏ నాయకుడికైనా ప్రజలు తగిన సమాధానం చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు కొనాల గంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి పోతులబోగుల శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కార్యదర్శి శేఖర్ నసూరాబాద్ మండల అధ్యక్షులు హనుమాన్లు దామరచ మాజీ సర్పంచ్ సాయిలు బిజెపి కౌన్సిలర్ భాస్కర్ రెడ్డి శ్రీకాంత్ మహేష్ పట్టణ ప్రధాన కార్యదర్శి చిరంజీవి ఉమేష్ బీజేపీ నాయకులు, లక్ష్మీనారాయణ శ్రీనివాస్ తృప్తి ప్రసాద్ చీకట్ల రాజు పురుషోత్తం. మహేందర్ సచిన్ లక్ష్మణ్ గంగారం. నాగరాజు విట్టల్. బలరాం సాయి. శివ కార్యకర్తలు పాల్గొన్నారు.