ఆటలకు వైకల్యం అడ్డు కాదు

29-09-2026 | 08:18pm

ఆర్మూర్‌ మండల విద్యాధికారి రవీందర్‌

ఆర్మూర్‌, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): ఆటలు, చదువుల్లో రాణించడానికి వైకల్యం అడ్డు కాదంటూ ఆత్మవిశ్వాసంతో  దివ్యాంగ  విద్యార్థులు ముందుకు సాగాలని ఆర్మూర్‌ మండల విద్యాధికారి రవీందర్‌(Mandal Education Officer Ravinder) సూచించారు. ఆర్మూర్‌ పట్టణంలోని భవిత కేంద్రంలో సమగ్ర శిక్ష సహిత విద్యా విభాగం ఆధ్వర్యంలో మండల స్థాయి దివ్యాంగుల క్రీడలను మంగళవారం నిర్వహించారు. ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యార్థులకు వేరు వేరుగా నిర్వహించిన ఈ పోటీల ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు.

అవకాశం వస్తే ఆకాశమే హద్దుగా తమ సత్తా చాటాలని సూచించారు. ఆర్మూర్‌ మండలం నుంచి జిల్లా స్ధాయికి ఎంపికైన ఐదుగురు విద్యార్థులను అభినందించారు. వీరు  జిల్లా కేంద్రంలోని మాణిక్‌బండార్‌ ఉన్నత  పాఠశాల మైదానంలో బుధవారం నిర్వహించనున్న జిల్లా స్థాయి పోటీల్లో పోటీ పడనున్నారని వివరించారు. అనంతరం క్రీడా పోటీల్లో పాల్గొన్న విద్యార్థులందరికీ బహుమతులను అందజేసారు. ఈ కార్యక్రమంలో ఐఈఆర్పీలు కిషన్, సురేష్, ఎంఐఎస్‌ కోఆర్డినేటర్‌ అలేఖ్య, ఆపరేటర్‌ రఘువీర్, మెసెంజర్‌ రవి, సీజీవీ కవిత, దివ్యాంగ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు