పౌష్టికాహారంతోనే ఆరోగ్య భవిత
* అంగన్‌వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి: సీడీపీవో సుశీల
రాయికోడ్, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): పౌష్టికాహారం తీసుకోవడంతో చిన్నారులు ఆరోగ్యంగా ఎదగడంతో పాటు అనారోగ్య సమస్యలకు దూరంగా ఉంటారని ఐసీడీఎస్ జహీరాబాద్ డివిజన్ సిడీపీవో సుశీల(CDPO Sushila) తెలిపారు. మంగళవారం రాయికోడ్, సింగీతం సెక్టార్లలో 9వ పోషణ మాస ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులకు అక్షరాభ్యాసం, అన్నప్రాశన, గర్భిణులకు శ్రీమంతం కార్యక్రమాలు నిర్వహించారు.
సుశీల మాట్లాడుతూ.. చిన్నారుల శారీరక, మానసిక వికాసానికి అంగన్‌వాడీ కేంద్రాలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించి, ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం, ఆరోగ్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అంతకుముందు అంగన్‌వాడీ, ఆశా, వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో పోషకాహారంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్లు సునీత, మంజుల, సర్పంచులు కుస్నూర్ శ్రావణి–నిరంజన్, బలముల రాధిక–తుకారం, అంగన్‌వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.