మోర్గి మోడల్ స్కూల్‌లో నమూనా పార్లమెంట్

29-09-2026 | 08:15pm

నాగల్‌గిద్ద, సెప్టెంబర్ 29 : నాగల్‌గిద్ద మండలంలోని మోర్గి మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు పార్లమెంట్ వ్యవస్థపై(Parliamentary system) అవగాహన కల్పించేందుకు నమూనా పార్లమెంట్ నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపల్ సువర్ణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాన్ని మండల ఎంపీడీవో మహేశ్వరరావు పరిశీలించి విద్యార్థుల ప్రదర్శనను సమీక్షించారు. పార్లమెంట్‌లో సభ నిర్వహణ, సభ్యుల బాధ్యతలు, ప్రశ్నోత్తరాలు, ప్రజా సమస్యలపై చర్చలు, నిర్ణయాలు తీసుకునే విధానాన్ని విద్యార్థులు ప్రదర్శించారు. హెడ్‌బాయ్ నరేష్ స్పీకర్‌గా వ్యవహరించారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన, నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు దోహదపడతాయని ఎంపీడీవో మహేశ్వరరావు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు