ఫోక్సో కేసులపై విద్యార్థులకు అవగాహన సదస్సు
లింగంపేట్. అక్టోబర్.28( విజయ క్రాంతి): లింగంపేట్ మండల.కేంద్రంలోని కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలలో(Kasturba Gandhi School) బుధవారం సురక్షిత బచ్పన్ అభియాన్ కార్యక్రమంలో(Surakshit Bachpan Abhiyan Program) భాగంగా ఎల్లారెడ్డి మెజిస్ట్రేట్ సుష్మా కేజీబీవీ పాఠశాలను సందర్శించారు. అనంతరం విద్యార్థినులకు ఫోక్సో కేసుల పై అవగాహన కల్పించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి విద్యార్థిని నిర్భయంగా భయం లేకుండా ఉండాలన్నారు చదువుపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు అల్లరి ముఖాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు అసభ్య పదజాలంతా ఎవరైనా దూషించినట్లయితే వెంటనే సమాచారం అందించాలన్నారు. బాల్య వివాహాలకు దూరముండాలన్నారు.
సైబర్ నేరాలు పట్ల అప్రమత్తంగా ఉండాలని ఇంట్లో తల్లిదండ్రులకు విద్యార్థినులు అవగాహన కల్పించాలని అన్నారు. ఈ సందర్భంగా ఆమె సూచించారు.ఈ కార్యక్రమంలో లింగంపేట్ ఎస్సై దీపక్ కుమార్. ప్రిన్సిపల్ వాసంతి. ఉపాధ్యాయుల బృందం విద్యార్థినిలు ఉన్నారు.