ఉరి వేసుకుని ఒకరు మృతి

07-10-2026 | 04:52pm

నాగిరెడ్డిపేట్, అక్టోబర్ 7 (విజయక్రాంతి): ఉరి వేసుకుని ఒకరు మృతి చెందిన ఘటన బొల్లారం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై భార్గవ్ గౌడ్(SI Bhargav Goud) తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని బొల్లారం గ్రామానికి చెందిన నుక్కని పోచయ్య వయసు (44) సంవత్సరాలు .నుక్కని పోచయ్య కూలి పని చేస్తూ జీవిస్తూ ఉండేవాడు. గత కొంతకాలంగా తాగుడుకు బానిసై భార్యతో గొడవపడి బొల్లారం గ్రామ శివారు పరిధిలో గల చెరువు కట్టపై గల చెట్టుకు ఉరి వేసుకొని మృతి చెందాడు.మృతునికి భార్య స్వరూప కూతురు ఉన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నట్లు ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపారు.

మరిన్ని వార్తలు