అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని మంత్రికి వినతి

07-10-2026 | 06:00pm

మల్లాపూర్, అక్టోబర్ 07(విజయక్రాంతి ): మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామ అభివృద్ధికి అవసరమైన పలు పనులకు అదనపు నిధులు కేటాయించాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అల్లూరి లక్ష్మణ్ కుమార్‌కు(State Minister for Welfare, Sri Alluri Lakshman Kumar) వినతిపత్రం అందజేశారు. జువ్వాడి నర్సింగరావు సమక్షంలో మంత్రిని కలిసి గ్రామంలోని ప్రధాన రహదారి,

మల్లాపూర్ లింక్ రోడ్డు, చుట్టుపక్కల గ్రామాల సరిహద్దు ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం తదితర అభివృద్ధి పనుల గురించి వివరించారు.అలాగే రాబోయే పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని అవసరమైన మరిన్ని నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. గ్రామ ప్రజల అవసరాలు, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గోల్కొండ కళ రమేష్, జలపతి రెడ్డి, వర్ధ సురేష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు