ఇందిరా కుటుంబ జీవిత బీమా పథకం విజయవంతం చేయాలి
నాగిరెడ్డిపేట్,నవంబర్ 20 (విజయక్రాంతి): మండల కేంద్రంలోని మండల సమాఖ్య సమావేశం(Mandal Federation Meeting) నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మండల స్పెషల్ ఆఫీసర్ రాజ్ కుమార్(Mandal Special Officer Raj Kumar) హాజరైనారు.ఈ సందర్భంగా మండల స్పెషల్ ఆఫీసర్ రాజ్ కుమార్ మాట్లాడుతూ... సమాఖ్య ప్రతినిధులకు ప్రభుత్వ పథకాలను(Government schemes) అట్టడుగు వర్గాలకు అందించడంలో మహిళా సంఘాల యొక్క కృషి చాలా అవసరమని వారు చెప్పారు.రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఇందిరా కుటుంబ జీవిత బీమా పథకం(Family Life Insurance Plan) ప్రవేశ పెట్టిందని, ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతంగా నిర్వహించాలని తెలిపారు.
అలాగే జిల్లా అదనపు డి.ఆర్.డి.ఓ విజయలక్ష్మి మాట్లాడుతూ...ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం కూడా త్వరలో ప్రభుత్వం ప్రారంభం చేయగానే ప్రతి మహిళా సంఘంలో ఉన్న సభ్యులకు మరియు సంఘాలలో లేని (Ration Card) రేషన్ కార్డులో ఉన్న 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడబిడ్డకు అందివ్వాలని చెప్పడం జరిగింది.
స్త్రీనిధి మరియు బ్యాంకు లింకేజీ రికవరీ విషయంలో గ్రామ సంఘం బాధ్యత తీసుకొని ఈ నెల చివరి వరకు ఎన్.పి.ఏ అమౌంట్ మొత్తం వసూళ్లు చేయాలని, అదే విధంగా లోకోస్ ఆప్‌లో సంఘాల సభ్యుల వివరాలు నమోదు, ఈకేవైసీ మరియు ఎల్‌నినో ప్రభావం ఉన్నందున మేకలు,కోళ్లు,గేదెల పెంపకం ప్రోత్సహించాలని ఆమె సూచించడం జరిగింది. అదే విధంగా వివిధ ప్రభుత్వ పథకాల అమలు,గ్రామ సంఘాల పనితీరు తదితర అంశాల గురించి వివరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల సమాఖ్య అధ్యక్షులు శాంతమ్మ ఏపిఎం దత్తు,గ్రామ సంఘాల ప్రతినిధులు,సిబ్బంది హాజరు కావడం జరిగింది.