NSS యూనిట్–6 ప్రోగ్రాం ఆఫీసర్గా డాక్టర్ ఎస్. నారాయణ నియామకం
కామారెడ్డి, నవంబర్ 3 (విజయక్రాంతి): తెలంగాణ విశ్వవిద్యాలయం దక్షిణ ప్రాంగణంలోని(భిక్కనూరు) జాతీయ సేవా పథకం (NSS) యూనిట్–6 ప్రోగ్రాం ఆఫీసర్గా డాక్టర్ ఎస్. నారాయణ(Dr. S. Narayana) నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ టీ. యాదగిరి రావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం యాదగిరి చేతుల మీదుగా మంగళవారం నియామక ఉత్తర్వులను అందుకున్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ ఎస్. నారాయణ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి ఎన్ ఎస్ ఎస్ యూనిట్–6 ప్రోగ్రాం ఆఫీసర్గా బాధ్యతలు అప్పగించిన ఉపకులపతి ప్రొఫెసర్ టీ. యాదగిరి రావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం. యాదగిరి గార్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
జాతీయ సేవా పథకం ద్వారా విద్యార్థుల్లో సేవాభావం, సామాజిక బాధ్యత, నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. సమాజ సేవా కార్యక్రమాల్లో విద్యార్థులను భాగస్వాములను చేస్తూ ఎన్ ఎస్ ఎస్ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్తానని తెలిపారు. నాపై నమ్మకంతో ఈ బాధ్యతను నాకు ఇచ్చినందుకు తెలంగాణ వర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఆచార్య టి యాదగిరిరావు, రిజిస్ట్రార్ ఆచార్య ఎం యాదగిరి కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ఎన్ఎస్ఎస్ కో-ఆర్డినేటర్ ప్రొఫెసర్ కె. అపర్ణ, తెలంగాణ విశ్వవిద్యాలయం దక్షిణ ప్రాంగణ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఆర్. సుధాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.