అంతర్ పంటగా గంజాయి సాగు

03-11-2026 | 10:28pm

* ఒకరి అరెస్ట్ గంజాయి మొక్కల స్వాధీనం..

ఆదిలాబాద్, నవంబర్ 03 (విజయక్రాంతి): గంజాయి సాగుపై జిల్లా పోలీస్, ఎక్సైజ్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. మావల మండలం వాఘాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కొలం గూడ గ్రామ శివారు ప్రాంతంలో పత్తి, కంది పంటల మాటున అంతర్ పంటగా సాగు చేస్తున్న గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ సీఐ శ్రీనివాస్(Prohibition and Excise Station CI Srinivas) తెలిపారు.

జిల్లాలో అంతర్ పంటగా గంజాయి సాగు చేస్తున్నారన్న పక్కా సమాచారంతో ఎక్సైజ్, జిల్లా టాస్క్ ఫోర్స్ సిబ్బంది సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మొత్తం 62 గంజాయి మొక్కలు పట్టుబడ్డాయని సీఐ వెల్లడించారు. గంజాయి సాగు చేస్తున్న కొడప జ్యోతి రామ్ పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ దాడుల్లో జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు శ్రావణ్ కుమార్, సిబ్బంది తానాజీ, కృష్ణ, శివ కుమార్, మధు, నరేష్, గౌతమ్ స్వప్న పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు