బీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు

03-11-2026 | 10:13pm

నిర్మల్ నవంబర్ 3 ( విజయ క్రాంతి): నిర్మల్ రూరల్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు(Congress and BJP leaders)  మంగళవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కొరిపెల్లి రామ్‌కిషన్‌రెడ్డి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ  ఈ నెల 11న నిర్మల్ పట్టణంలో 'యువ గర్జన' పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అయ్యన్నగారి రాజేందర్, ముత్యం రెడ్డి, మహేష్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు