రైతుల అభివృద్ధి,సంక్షేమానికి కృషి చేయాలి

03-11-2026 | 10:00pm

ఘనంగా వ్యవసాయ కమిటీ ప్రమాణస్వీకారం

ఇల్లంతకుంట,నవంబర్ 3 (విజయక్రాంతి): రైతుల అభివృద్ధి(Development of Farmers) సంక్షేమానికి కృషి చేయాల్సిన  బాధ్యత వ్యవసాయ మార్కెట్ పాలకవర్గంపై(Agricultural Market Governing Body) ఉందని మానకొండూరు ఎమ్మెల్యే టిపిసిసి ఎస్సీ సెల్ చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నాడు, మంగళవారం ఇల్లంతకుంట మండల కేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వర ఫంక్షన్ హాల్ లో జరిగిన వ్యవసాయ మార్కెట్‌ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ శ్రీకారోత్సవానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.

మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా ఇల్లంతకుంట కు చెందిన అంతగిరి సాహిత్య వినయ్ కుమార్, వైస్ చైర్మన్‌గా రెపకా గ్రామానికి చెందిన భరత్ రెడ్డి,మరియు డైరెక్టర్లు  ప్రమాణ స్వీకారం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్ కమిటీ ద్వారా అందించే సేవలతో రైతులు సంతోషంగా ఉండేలా చూడాలి అని అన్నాడు.

రైతుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని, రాష్ట్రంలో ఇల్లంతకుంట మార్కెట్‌ కమిటీని ఆదర్శ వంతంగా తీర్చిదిద్దాలన్నాడు, మార్కెట్ యార్డును అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలి అని రైతులకు మార్కెట్లో అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా పాలకమండలి పని చేయాలని ఎమ్మెల్యే అన్నాడు.

ఎల్ నినో ప్రభావంతో రానున్న రోజుల్లో తీవ్ర కరువు ఏర్పడుతుంది అని కాబట్టి రైతులు ఆరు తడి పంటల సాగుపై దృష్టి సారించాలని తెలిపాడు,ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్టీ శ్రేణులకు దిశ నిర్దేశం చేసాడు,కార్యకర్తలు ఆశావహ దృక్పథంతో ముందుకు సాగాలి అని అందరికీ పదవులు  సాధ్యం కానప్పటికీ కష్టపడ్డోళ్లకు మాత్రం పదవులు కట్టబెట్టాల్సిన అవసరం ఉందని కష్టపడుతున్న వారికి పదవులు కల్పించే విషయంలో నిరంతరం తన ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశాడు,

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి, పీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాస్ గౌడ్, ఇల్లంతకుంట, పాక్స్ చైర్మన్ ఊట్కూరి వెంకటరమణారెడ్డి, వైస్ చైర్మన్ యాస తిరుపతి, మానకొండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ రేవెల్లి రాజలింగం, వైస్ చైర్మన్ రేమిడి శ్రీనివాస్ రెడ్డి,బెజ్జంకి నుస్తులాపూర్,పోరండ్ల, ఊటూరు పాక్స్ చైర్మన్లు ఒగ్గు దామోదర్,

మోరపల్లి రమణారెడ్డి, గోపు తిరుపతిరెడ్డి, ముద్దసాని శ్రీనివాస్ రెడ్డి, పార్టీ నాయకులు రాఘవరెడ్డి, పసుల వెంకటి, ఐరెడ్డి మహేందర్ రెడ్డి, ప్రసాద్, ఉప్పగల్ల మల్లారెడ్డి, జనగాం రాజయ్య, ముస్కు ఉపేందర్ రెడ్డి, ముక్కిస రత్నాకర్ రెడ్డితో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు,రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు