బయ్యక్కపేట పాఠశాలను సందర్శించిన ఐటీడీఏ పీఓ

06-10-2026 | 06:25pm

పాఠశాలల నిర్వహణపై దృష్టి సారించాలని సూచన 

ములుగు, అక్టోబర్ 6 (విజయక్రాంతి): బయ్యక్కపేటలోని గిరిజన సంక్షేమ ప్రాథమికోన్నత పాఠశాలను(Tribal Welfare Upper Primary School) ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో(ITDA PO Lenin Vatsal Toppo) మంగళవారం సందర్శించి పాఠశాలలోని విద్యా పరిస్థితులు, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పీఓ తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థుల నోట్‌బుక్స్, అభ్యసన స్థాయి, విద్యా ప్రగతిని పరిశీలించి, పాఠ్యాంశాలపై వారికి ఉన్న అవగాహనను తెలుసుకున్నారు.

విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరై చదువుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పాఠశాలలోని కంప్యూటర్ ల్యాబ్, డార్మిటరీ తదితర సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు, పరిశుభ్రమైన వాతావరణం కల్పించేలా పాఠశాల సిబ్బంది చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు తరగతి బోధన, విద్యార్థుల అభ్యాసన, ప్రగతి, హాజరు, పాఠశాల నిర్వహణపై నిరంతరం దృష్టి పెట్టాలని పీఓ సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అన్ని సౌకర్యాలు అందేలా చూడాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు.

మరిన్ని వార్తలు