చందాపూర్ లో బిర్నీస్ రాజ్మా పంటల పరిశీలన

18-11-2026 | 05:33pm

తాడ్వాయి,నవంబర్,18( విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చందాపూర్ గ్రామంలో(Chandapur Village) బుధవారం బీర్నీస్ రాజ్మా పంటలను అధికారులు,శాస్త్రవేత్తలు పరిశీలించారు.ఈ సందర్భంగా బీర్నిస్ రాజ్మా విత్తనాలు సరిగ్గా మొలకెత్తకపోవడంపై గల కారణాలను పరిశీలించారు.

చందాపూర్ లో బీర్నీస్ రాజ్మా పంట సాగుచేసిన రైతుల పొలాలకు టి ఆర్ వి కే శాస్త్రవేత్తలు రేవంత్,రమ్య రాథోడ్, మహేశ్వరి వెళ్లి బుధవారం పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రాజ్మా విత్తనాలు మొలకెత్తక పోవడానికి గల కారణాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.ఎందుకు మొలకెత్తలేదు సమస్యలు ఏమిటి అనే విషయమై ఆరా తీస్తున్నట్లు తెలిపారు. మొలకెత్తిపోవడంలో ఎదురవుతున్న సమస్యలను రైతులతో చర్చించారు.విత్తనాలు ఎక్కడ తీసుకువచ్చారు, విత్తనాలను ఏ రకంగా వేసుకున్నారు.

అనే విషయాలను రైతులను అడిగి తెలుసుకున్నారు.రైతులకు తగిన వ్యవసాయ సాంకేతిక సూచనలు, పంట యాజమాన్య పద్ధతులపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు.బీర్నీస్ రాజ్మా విత్తనాలు పూర్తిస్థాయిలో మొలకెత్తకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని,తీవ్రంగా నష్టపోయామని రైతులు శాస్త్రవేత్తలకు వివరించారు.

విత్తనాలు నకిలీవి కావడంతోనే మొలకెత్తులేవని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మోహన్ రెడ్డి,తాడ్వాయి వ్యవసాయ అధికారి నర్సింలు, ఏ ఈ ఓ లు అశోక్ రెడ్డి, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు