పద్మశాలి భవన్‌కు పెండింగ్ బిల్లుల విడుదల
- రూ.2 కోట్ల బిల్లులు కాంట్రాక్టర్ ఖాతాలో జమ
- మళ్లీ ఊపందుకోనున్న భవన నిర్మాణ పనులు.. హర్షం వ్యక్తం చేస్తున్న పద్మశాలీలు
రాజన్న సిరిసిల్ల29సెప్టెంబర్ (విజయక్రాంతి): సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అసంపూర్తిగా ఉన్న పద్మశాలి భవన్( Padmashali Bhavan) నిర్మాణ పనులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న బిల్లులు విడుదలయ్యాయి. గతంలో చేపట్టిన పనులకు సంబంధించిన సుమారు రూ.2 కోట్ల బకాయిలను అధికారులు కాంట్రాక్టర్ ఖాతాలో జమ చేశారు. దీంతో పద్మశాలి భవన్ నిర్మాణ పనులు తిరిగి ముమ్మరం కానున్నాయి.పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించి నిధుల విడుదలకు చర్యలు తీసుకోవడంతో బకాయిలు చెల్లింపయ్యాయి.
పద్మశాలి భవన్ నిర్మాణానికి అవసరమైన పెండింగ్ నిధులు విడుదల కావడంపై సిరిసిల్ల పద్మశాలి సమాజం హర్షం వ్యక్తం చేసింది. నిధుల విడుదలకు కృషి చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌లకు పద్మశాలీలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భవన నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తిచేయాలని వారు ఆకాంక్షించారు.