పీఆర్టీయూ టి.ఎస్. మునిపల్లి మండల శాఖ నూతన కార్యవర్గం ఎన్నిక
మునిపల్లి సెప్టెంబర్ 29 ( విజయక్రాంతి ) : మునిపల్లి మండల పరిధిలోని బుధేరా ప్రాథమిక పాఠశాలలో మంగళవారం పీఆర్టీయూ టి.ఎస్. మునిపల్లి(PRTU T.S. Munipalli) మండల శాఖ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 2024–26 కాలానికి సంబంధించిన పాత కార్యవర్గాన్ని రద్దు చేసి, 2026–28 కాలానికి నూతన మండల కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పీఆర్టీయూ టి.ఎస్. రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గుండు లక్ష్మణ్, జిల్లా అధ్యక్షుడు ఆకుల మాణయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల ప్రభు, జిల్లా గౌరవ అధ్యక్షుడు డాక్టర్ తులసీరామ్ రాథోడ్ లు హాజరయ్యారు.
2026–28 కాలానికి పీఆర్టీయూ టి.ఎస్. మునిపల్లి మండల శాఖ అధ్యక్షుని గా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కంకోల్ (తెలుగు మీడియం)కు చెందిన పట్లోళ్ల భాస్కర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కంకోల్ (ఉర్దూ మీడియం)కు చెందిన ప్యాట ఉమేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరితో పాటు ఇతర మండల స్థాయి పదవులకు కూడా నూతన కార్యవర్గ సభ్యులను రెండేళ్ల కాలానికి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు పలువురు ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంతో పాటు విద్యారంగ అభివృద్ధికి నూతన కార్యవర్గం కృషి చేయాలని వారు ఆకాంక్షించారు. ఈ సమావేశంలో మునిపల్లి మండలానికి చెందిన పలువురు ఉపాధ్యాయులు, పీఆర్టీయూ టి.ఎస్. సభ్యులు పాల్గొన్నారు.