భువనగిరి PACS అర్ధవార్షిక సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే కుంభం...

29-09-2026 | 08:49pm

ఆలేరు, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): భువనగిరి మండలం అనాజిపూర్‌లోని ఎస్‌వీఎస్ గార్డెన్‌లో భువనగిరి వ్యవసాయ సహకార పరపతి సంఘం(PACS) ఆధ్వర్యంలో మంగళవారం అర్ధవార్షిక సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి భువనగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి(MLA Anil Kumar Reddy) ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా PACS నూతన చైర్మన్‌గా నియమితులైన పక్కీరు కొండల్ రెడ్డి, వైస్ చైర్మన్ గడ్డమీది వీరస్వామి గౌడ్తో పాటు నూతన పాలకవర్గ సభ్యులను ఎమ్మెల్యే అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

రైతులకు సహకార సంఘాల ద్వారా మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అవే చిస్తి, భువనగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖ బాబురావు, టీపీసీసీ డెలిగేట్ తంగళ్లపల్లి రవికుమార్, భువనగిరి మున్సిపల్ వైస్ చైర్మన్ పోతంశెట్టి మంజుల వెంకటేశ్వర్లు, చందుపట్ల PACS చైర్మన్ సతీష్ పవన్, బీబీనగర్ PACS చైర్మన్ పొట్టోళ్ల శ్యామ్ గౌడ్, వలిగొండ PACS చైర్మన్ గరిసె రవికుమార్, ఆత్మ చైర్మన్ ఎలిమినేటి కృష్ణారెడ్డి, మండల, పట్టణ అధ్యక్షులు ఎల్లంల జంగయ్య, కూర వెంకటేష్, కౌన్సిలర్లు, వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు