సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

29-09-2026 | 08:40pm

ఘట్ కేసర్, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) హిందూ దేవుళ్లను అవమానించే విధంగా హిందువుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేసే మాటలు మాట్లాడినందుకు నిరసనగా మంగళవారం ఘట్కేసర్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద ఘట్కేసర్ డివిజన్ బిజెపి అధ్యక్షులు కొమ్మిడి మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.

సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు కాలేరు రామోజీ, సీనియర్ నాయకులు పల్లె మధు, బండ్లగూడ కిషోర్, సత్యనారాయణ రెడ్డి, కొమ్మిడి విక్రాంత్ రెడ్డి, భాను ప్రకాష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మంగు రాధిక, యువమోర్చా అధ్యక్షులు అనిల్ గౌడ్, సురేందర్ యాదవ్, రిషి, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు