పత్తిలో అధిక దిగుబడే లక్ష్యం

06-10-2026 | 06:41pm

పెంచికల్‌పేట్( విజయక్రాంతి ): మండలములోని అగర్‌గూడ గ్రామంలో కపాస్ క్రాంతి మిషన్‌ ద్వారా పత్తి విత్తనాలు పొందిన రైతుల పంటలను సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు(Sirpur MLA Dr. Palvai Harish Babu) వ్యవసాయ అధికారులతో కలిసి పరిశీలించారు. అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగుతో ఎకరాకు 15 క్వింటాళ్ల వరకు దిగుబడి సాధించే అవకాశం ఉందన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, పిచికారీ మందులు అందించడమే కపాస్ క్రాంతి మిషన్‌ లక్ష్యమన్నారు.

అనంతరం అగర్‌గూడలో రైతులకు బయోస్టిములెంట్లు, దోమ నివారణ మందులను ఉచితంగా పంపిణీ చేశారు. యూరియా, డీఏపీ సరఫరాను క్రమబద్ధీకరించామని, వరి, పత్తి, మక్క రైతులకు మద్దతు ధర అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే తెలిపారు.

కార్యక్రమంలో సర్పంచ్ అల్లూరి రాజేశ్వరి, జిల్లా వ్యవసాయ అధికారి డా. వెంకటి, ఏవో రామకృష్ణ, వ్యవసాయ శాస్త్రవేత్త డా. మధు, పలువురు సర్పంచులు చపిడె రవి, రాంచందర్ , ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు