ఆలయ నిర్మాణానికి విరాళాలు
లింగంపేట్. అక్టోబర్. 28( విజయ క్రాంతి): మండలంలోని లింగంపల్లి ఖుర్దు గ్రామంలో(Lingampalli Khurd Village) పోలేరమ్మ ఆలయ నిర్మాణానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బుధవారం విరాళాలు అందజేశారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ ఎదురుగట్ల సంపత్ గౌడ్(TRS Party In-charge Edurugatla Sampath Goud) ఆధ్వర్యంలో లింగంపేట్ మండలం లోనీ లింగంపల్లి ఖుర్దు గ్రామంలో పోలేరమ్మ తల్లి విగ్రహం కొరకు 12500.విరాళం ఆలయ కమిటీ నిర్వాహకులకు ఆయన అందజేశారు.
ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ఆయనకు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు ఆలయ నిర్మాణానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పోకల సాయిరాం.జిల్లా యూత్ అధ్యక్షుడు దేగావత్ జైల్ సింగ్.మండల యూత్ అధ్యక్షుడు మోహన్ రెడ్డి.కృష్ణ గౌడ్.రవి రాజేందర్.సంతోష్.స్వామి.రమేష్.అంజయ్య. ఆశయ్య.రాములు. భజన మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.