కరీంనగర్ జిల్లా గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా నల్లగొండ తిరుపతి గౌడ్ నియామకం
01-09-2026 | 09:49pm
కొత్తపల్లి,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షులు గా నల్లగొండ తిరుపతి గౌడ్ నియమించినట్లు వ్యవస్థాపక అధ్యక్షులు గట్టు రాంచేందర్ రావు సోమవారము రోజున ఒక ప్రకటనలో తెలియచేయడం జరిగింది. ఈ సందర్బంగా నల్లగొండ తిరుపతి గౌడ్ మాట్లాడుతూ... నాపై నమ్మకంతో రెండవసారి ఈ బాధ్యత ను కట్టబెట్టిన గట్టు రాంచేందర్ రావుకి,గౌడ కుల బాంధవులకు అందరికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని , గౌడ కులస్తుల సంక్షేమం కోసం వారి అభ్యున్నతి కోసం ఎల్లప్పుడు కృషి చేస్తానని ఆయన తెలిపారు.






