కదం తొక్కిన బీఆర్‌ఎస్ శ్రేణులు
కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, సెప్టెంబరు 2 (విజయక్రాంతి): ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కదం తొక్కారు. చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండల కేంద్రంలో కదం తొక్కిన చొప్పదండి బిrఆర్‌ఎస్(BRS) శ్రేణులు మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్(Sunke Ravi Shankar), బీఆర్‌ఎస్ సీనియర్ నేత కొత్త జయపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
నాయకులు వీర్ల వెంకటేశ్వరరావు, పన్నియాల భూపతి రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, దూలం బాలగౌడ్, గంగాధర మండలం బీఆర్‌ఎస్ పార్టీ అ ధ్యక్షుడు మెచినేని నవీన్ రావు, బోయినిపల్లి మండల అధ్యక్షుడు కత్తెర పాక కొండయ్య, చొప్పదండి మండల అధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గ డ్డం చుక్కా రెడ్డి, మాజీ జడ్పిటిసి మాచర్ల వినయ్, బీఆర్‌ఎస్ యూత్ నియోజకవర్గ కన్వీనర్ బందారపు అజయ్ కుమార్, మా ల్యాల మండల అధ్యక్షుడు జనగం శ్రీనివాస్, రామడుగు మండల బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు గంట్ల జితేందర్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
- హుజురాబాద్ లో పాడి ఆధ్వర్యంలో...
హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బుధవారం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయ డంలో విఫలమైందని ఆరోపిస్తూ నాయకులు 420 హామీలు420 ఫిట్లు అనే భారీ ఫ్లెక్సీని ప్రదర్శించారు.
- మానకొండూరులో....
ప్రజలకు 420 హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 1, 000 రోజులు / 33 నెలల కాలంలో ఆ హామీలను నెరవేర్చలేకపోయిందని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, కరీంనగర్ బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు లు మండిపడ్డారు. మానకొండూరులో జరిగిన ఈ నిరసనలో ఆరు మండలాల పార్టీ అధ్యక్షులు తాళ్లపల్లి శేఖర్ గౌడ్ మానకొండూరు, రావుల రమేష్ తి మ్మాపూర్, గంట మహిపాల్ శంకరపట్నం, గంప వెంకన్న గన్నేరువరం, మహిపాల్ రెడ్డి బెజ్జంకి, నరసింహరెడ్డి ఇల్లంతకుంట ,ల తోపాటు ఆయా మండలాల పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
- జగిత్యాలలో...
జగిత్యాల జిల్లా టిఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, రా ష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణంలో వినూత్న నిరసన తెలిపారు, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన 420 హామీలు ఆరు గ్యారెంటీలతో ప్రజలను మోసం చేసి గద్దెనెక్కి అబద్ధపు హామీలతో కాలయాపన చేస్తున్నారని దుయ్యబట్టారు.
- కోరుట్ల లో160 మీటర్ల ఫ్లెక్సీతో ర్యాలీ ధర్నా...
కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఆధ్వర్యంలో 160 మీటర్ల ఫ్లెక్సీ తో ర్యాలీ ని ర్వహించి అంబేద్కర్ చౌరస్తా వద్ద టిఆర్‌ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతు మోసపూరితమైన హామీలు ఇచ్చి తెలంగాణ మ హిళలను, నిరుద్యోగులను, విద్యార్థులను, రైతులను రేవంత్ రెడ్డి మోసం చేశారన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు పెద్దఎత్తున నిరసనలు చేపడతామని అన్నారు. ఈకార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ లోకబాపురెడ్డి రైతు సమన్వయ కమిటీ జిల్లా అధ్యక్షులు చీటి వెంకటరావు, దారిశెట్టి రాజే ష్ తదితరులు పాల్గొన్నారు.
- కె టి ఆర్ ఇలాఖా సిరిసిల్ల లో..... బీఆర్‌ఎస్ నిరసన ర్యాలీ
కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ ఆ ధ్వర్యంలో సిరిసిల్లలో నిరసన ర్యాలీ నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.బీఆర్‌ఎస్ అధిష్ఠా నం పిలుపు మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమం ర్యాలీలో బీఆర్‌ఎస్ శ్రేణులు ప్లకార్డు లు, ఫ్లెక్సీలు ప్రదర్శిస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు.
వేములవాడ లో.......420 అడుగుల ఫ్లెక్సీతో బీఆర్‌ఎస్ నిరసన
- వేములవాడలోకాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనకు నిరసనగా వేములవాడలో బీఆర్‌ఎస్ ఇంచార్జి చెల్మెడ నర్సింహారావు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కోరుట్ల బస్టాండ్ నుంచి తెలంగాణ తల్లి విగ్రహం వరకు చేపట్టిన ర్యాలీలో 420 అడుగుల ఫ్లెక్సీని ప్రదర్శిస్తూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హామీలు నెరవేర్చకపోతే ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని బీఆర్‌ఎస్ నాయకులు హెచ్చరించారు.






