గన్నేరువరం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి

28-10-2026 | 04:02pm

గన్నేరువరం, అక్టోబర్ 28(విజయ క్రాంతి): ఎల్‌నినో ప్రభావం(The impact of El Niño), తక్కువ వర్షపాతం కారణంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని గన్నేరువరం మండలాన్ని వెంటనే కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ, బీజేపీ గన్నేరువరం మండల శాఖ అధ్యక్షుడు తిప్పర్తి నికేష్ ఆధ్వర్యంలో సంబంధిత అధికారులకు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా తిప్పర్తి నికేష్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించిన జాబితాలో గన్నేరువరం మండలానికి చోటు కల్పించకపోవడం బాధాకరమని అన్నారు. తక్కువ వర్షపాతం కారణంగా రైతులు వ్యవసాయానికి, సాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.గన్నేరువరం మండలాన్ని వెంటనే కరువు మండలంగా ప్రకటించి,

అర్హులైన రైతులకు ప్రభుత్వ సహాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి రైతులకు న్యాయం చేయాలని కోరుతూ అధికారులకు వినతిపత్రం సమర్పించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య

అతిథిగా బిజెపి జిల్లా కార్యదర్శి సంపెల్లి సంపత్ రావు సీనియర్ నాయకులు కొండాపూర్ సర్పంచ్ సొల్లు అజయ్ వర్మ బిజెపి మండల ప్రధాన కార్యదర్శి పుల్లెల రాము మండల కార్యదర్శి బూట్ల సంపత్ జగన్మోహన్ తాళ్ల పెళ్లి పరుశురాం సంధ వేణి ప్రశాంత్ మునిగంటి సత్తయ్య గూడెల్లి మల్లేశం జీల కుమార్ యాదవ్ మునిగంటి లింగయ్య బోయిని అభిషేక్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు