అంబేద్కర్‌పై వ్యాఖ్యలు
- దళిత సంఘాల ఆగ్రహంతో వెనక్కి తగ్గిన బీజేపీ నాయకుడు గంగిశెట్టి రాజు
- అంబేద్కర్ జోలికి వస్తే సహించేది లేదు.
- దళిత, ప్రజా సంఘాల నాయకులు.
హుజూరాబాద్,అక్టోబర్28: (విజయక్రాంతి): రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌పై(Dr. B. R. Ambedkar) సోషల్ మీడియాలో చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీజేపీ నాయకుడు గంగిశెట్టి రాజు బహిరంగ క్షమాపణలు తెలిపారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. తన మాటలతో మనస్తాపానికి గురైన దళిత, ప్రజా సంఘాల నాయకులకు విచారం వ్యక్తం చేశారు.
కాగా, ఈ వ్యాఖ్యలపై దళిత సంఘాల నాయకులు హుజూరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పాటు అంబేద్కర్ చౌరస్తాలో నిరసన తెలిపారు. అంబేద్కర్‌ను, రాజ్యాంగాన్ని కించపరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకుడు రుద్రారం రామచందర్, వేల్పుల ప్రభాకర్, కొలిపాక సమ్మయ్య, తునికి సమ్మయ్య, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.